ఫోటో, వీడియో గ్రాఫర్స్ ఎన్నికల్లో లింగమూర్తి ప్యానెల్‌కు గూడూరు మండల అసోసియేషన్ మద్దతు
గూడూరు మండల ప్రతినిధి, సెప్టెంబర్ 27 (మన సమగ్ర ప్రజావాణి): మహబూబాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో గూడూరు మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు లింగమూర్తి, ఆయన ప్యానెల్‌కు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా శనివారం లింగమూర్తి ప్యానెల్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. లింగమూర్తితో పాటు ఆయన ప్యానెల్‌లోని తొమ్మిది మంది అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని గూడూరు మండల సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ నంబర్లు 9, 10, 14, 29, 34, 37, 41, 45, 46గా పేర్కొన్నారు.
లింగమూర్తి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని ఆకాంక్షిస్తూ, ఫోటోగ్రాఫర్ల ఐక్యత మరింత బలోపేతం కావాలని సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ ఆశి, కార్యవర్గ సభ్యుడు అయినవోలు శ్రీధర్ శర్మ, గూడూరు మండల అధ్యక్షుడు బొజ్జ కరుణాకర్, కార్యదర్శి మేరెడ్డి చంద్రశేఖర్, కోశాధికారి చుంచ కిరణ్, మానుకోట జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు చిదురాల సోమయ్య, గూడూరు మండల మాజీ గౌరవ అధ్యక్షుడు బురగాని శ్రీరామ్, మాజీ మానుకోట జిల్లా రాష్ట్ర కార్యదర్శి అయినవోలు బాలచందర్, తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మండ కార్తీక్, గూడూరు మండల మాజీ అధ్యక్షుడు చెన్నబోయిన లక్ష్మణ్, మాజీ కార్యదర్శి అజ్మీర వెంకటేష్, మాజీ కోశాధికారి ముదురుకోళ్ల ప్రభాకర్, అలీం, కిషోర్, రాజేష్, మహేష్, శరత్, షారుఖాన్ తదితరులు పాల్గొన్నారు.