prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 5:15 pm Digital Edition : PRAJA VANI

ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఎన్నికల్లో లింగమూర్తి, వారి ఫ్యానెల్ సభ్యులకు మద్దతు

ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఎన్నికల్లో లింగమూర్తి, వారి ఫ్యానెల్ సభ్యులకు మద్దతు

గూడూరు మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు

గూడూరు మండల ప్రతినిధి:- సెప్టెంబర్ 27. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా, ఈరోజు గూడూరు మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి, లింగమూర్తి, ఆయన ప్యానెల్‌కు తమ పూర్తి మద్దతును, శనివారం రోజున లింగమూర్తి వారి పోస్టర్ ను రిలీజ్ చేశారు. లింగమూర్తి, వారి ప్యానెల్‌ లోని 9 మంది అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, గూడూరు మండల సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చారు. బ్యాలెట్ పేపర్ నంబర్లు 9 • 10 • 14 • 29 • 34 • 37 • 41 • 45 • 46లు. లింగమూర్తి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గా ఎన్నిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి! ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఐక్యత చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ ఆశి, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు అయినవోలు శ్రీధర్ శర్మ, గూడూరు మండల అధ్యక్షుడు బొజ్జ కరుణాకర్, కార్యదర్శి మేరెడ్డి చంద్ర శేఖర్, కోశాధికారి చుంచ కిరణ్, మానుకోట జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు చిదురాల సోమయ్య, గూడూరు మండల మాజీ గౌరవ అధ్యక్షుడు బురగాని శ్రీరామ్, మాజీ మానుకోట జిల్లా రాష్ట్ర కార్యదర్శి అయినవోలు బాలచందర్, తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మండ కార్తీక్, గూడూరు మండల మాజీ అధ్యక్షుడు చెన్నబోయిన లక్ష్మణ్, గూడూరు మండల మాజీ కార్యదర్శి అజ్మీర వెంకటేష్, మాజీ మండల కోశాధికారి ముదురుకోళ్ల ప్రభాకర్, అలీం, కిషోర్, రాజేష్, మహేష్, శరత్,షారుఖాన్, తదితరులు పాల్గొన్నారు.