*ఫైజాబాద్ లో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం*
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం – 2026 కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, శశికళ ఆశా వర్కర్లు, గ్రామ మహిళలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు పోషకాహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యంగా ఉంటారని, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, పప్పు ధాన్యాలు రోజూ ఆహారంలో తీసుకోవాలని అవగాహన కల్పించారు.

చిన్నారుల్లో రక్తహీనత, తక్కువ బరువు సమస్యలు రాకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నరు