prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:57 am Digital Edition : MAHESH MEDCHAL

ఫేక్ అధికారి… ట్రేడ్ లైసెన్స్ పేరుతో వసూళ్లు..

ఫేక్ అధికారి… ట్రేడ్ లైసెన్స్ పేరుతో వసూళ్లు..

ఓ ఫేక్ అధికారి ఉద్దాంతం గుట్టు రట్టయింది. తను లేబర్ ఆఫీసర్ అని ట్రేడ్ లైసెన్స్ ల పేర్లతో దుకాణాలు హోటల్ నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఈ ఫేక్ అధికారి వ్యవహారం బయటపడింది. ఇతని తీరును గమనించిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫేక్ అధికారి గుట్టు రట్టయింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఉన్నాయి. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో తాను లేబర్ ఆఫీసర్ అని చెప్పుతూ స్థానిక ప్రజలను నమ్మిస్తూ ట్రేడ్ లైసెన్స్ పేరుతో స్థానిక దుకాణాలు హోటల్ నుండి అక్రమంగా డబ్బులను వసూళ్ల కు దిగాడు. అయితే సదరు వ్యక్తి ప్రవర్తన మాట తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు ఐడి కార్డు చూపించాలంటూ నిలదీశారు. సదర్ వ్యక్తి చూపించిన ఐడి కార్డు నకిలీ దిగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా. నకిలీ అధికారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .

గతంలోనూ మేడ్చల్ లో సేమ్ సీన్

గతంలోనూ మేడ్చల్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది. తాను జోనల్ కమిషనర్ అంటూ ఓ వ్యక్తి మేడ్చల్ లో ని కేఎల్ఆర్ వెంచర్ లో అందిన కాడికి దండుకుంటూ పోలీసులకు పట్టు పడ్డాడు. ఇతని ప్రవర్తనపై స్థానికులకు అనుమానం రావడంతో నకిలీ జోనల్ అధికారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
సదరు వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారించగా పొట్టకూటి కోసం నకిలీ అధికారిగా అవతారమెత్తినట్లు తేలింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాను అధికారిని అని చెబుతూ వసూళ్లకు పాల్పడితే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. తాను అధికారిని ఎవరు నమ్మవద్దని
ఐడి కార్డును చూపించమని కోరాలని సూచించారు. సదర్ వ్యక్తిపై ఏమాత్రం అనుమానాలు ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం ఇ