ప్లాస్టిక్ రహిత గ్రామంగా భూపతిపూర్ ను తీర్చి దిద్దుతాం

*ప్లాస్టిక్ రహిత గ్రామంగా భూపతిపూర్ ను తీర్చి దిద్దుతాం* *రాయికల్ ;సెప్టెంబర్ 27 (ప్రజావాణి):* పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపతిపూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బొల్లె చిన్నయ్య వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గ్రామస్థులు, విద్యార్థుల భాగస్వామ్యంతో ఆదివారం గ్రామంలోని ప్రధాన వీధులు, రహదారుల వెంట పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు "ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి - పర్యావరణాన్ని కాపాడండి", "ప్లాస్టిక్ రహిత గ్రామమే మన...