ప్రేమ, ఈర్ష్యతో యువతి హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
గోదావరిఖని యువతి మృతి కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్ గోదావరిఖని, సెప్టెంబర్ 20: గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ, ఈర్ష్య నేపథ్యంలో యువతిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ జెట్టి నవీన్ కుమార్ (38), సింగరేణిలో ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ (35)ను పోలీసులు...