ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి
టేకుమట్ల/ప్రజావాణి: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని చిట్యాల సీఐ సతీష్ సూచించారు. టేకుమట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వినాయక మండపాల నిర్వాహకులతో టేకుమట్ల ఎస్‌ఐ జి. అమూల్య సమక్షంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ.వినాయక మండపాలను ఏర్పాటు చేసే స్థల యజమానుల అనుమతితో పాటు విద్యుత్‌శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ బాక్సులు ఏర్పాటు చేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు...