prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 7:25 am Digital Edition : SURENDHARTEKUMATLA TEKUMATLA

ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి

టేకుమట్ల/ప్రజావాణి: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని చిట్యాల సీఐ సతీష్ సూచించారు. టేకుమట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వినాయక మండపాల నిర్వాహకులతో టేకుమట్ల ఎస్‌ఐ జి. అమూల్య సమక్షంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ.వినాయక మండపాలను ఏర్పాటు చేసే స్థల యజమానుల అనుమతితో పాటు విద్యుత్‌శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ బాక్సులు ఏర్పాటు చేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు.విద్యుత్ వైర్లు చిన్నారులకు అందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మండపం వద్ద ఎల్లప్పుడూ ఇద్దరు నిర్వాహకులు ఉండేలా చూసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజు ఉదయం 10 గంటల నుంచే ఏర్పాట్లు చేసుకుని సాయంత్రం 4 గంటల్లోపు అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పోలీసులకు నిర్వాహకులు సహకరించి వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించాలని కోరారు.