prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 3:03 pm Digital Edition : SRIKANTH MULUGU

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి

అన్నదాన కార్యక్రమంలో పస్ర సీఐ దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో రామకృష్ణ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమానికి పస్ర సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం గణేష్ మండపాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.
గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ సందర్భంగా సీఐ దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్ లను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువా కప్పి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.