*ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి: నాయకులు, పోలీసులు*
*గణేష్ మండపాల సందర్శనలో భక్తి.. భద్రతకు పెద్దపీట* *ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి: నాయకులు, పోలీసులు* మేడ్చల్, ప్రజా వాణి: మేడ్చల్ డివిజన్ పరిధిలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు గణేష్ మండపాలను మాజీ కౌన్సిలర్ పాలకుర్తి భవాని రాఘవేందర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్, మేడ్చల్ ఎస్సై భానుచందర్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో మండపాలను సందర్శిస్తున్న...