ప్రశాంతంగా ముగిసిన గణపతి నిమజ్జనాలు
సెప్టెంబర్ 27.ప్రజావాణి న్యూస్/ పర్వతగిరి
పర్వతగిరి మండల కేంద్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణపతి నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి.నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పర్వతగిరి పట్టణ ఎస్‌ఐ బి. ప్రవీణ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గణనాథుల విగ్రహాలను భక్తులు నిమజ్జనం కోసం పోలుకమ్మ చెరువు వద్దకు తీసుకువచ్చారు.ఈ సందర్భంగా భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలకు తావులేకుండా ఎస్‌ఐ బి. ప్రవీణ్ స్వయంగా నిమజ్జన ప్రదేశంలో ఉండి పరిస్థితులను పర్యవేక్షించారు.పోలీసు సిబ్బంది కూడా భక్తులకు అవసరమైన సూచనలు చేస్తూ, నిమజ్జన కార్యక్రమాలు సురక్షితంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.పోలీసుల సమన్వయంతో గణపతి నిమజ్జనాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయి.