ప్రముఖ వైద్యుడు నాగిరెడ్డి ఇంటి నిర్మాణ పనులపై ఆరోపణలు

రోడ్డుపైకి వ్యర్థ జలాలు వదులుతూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ ఫిర్యాదులు రామగుండం కార్పొరేషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్ స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రముఖ వైద్యుడు నాగిరెడ్డి ఇంటి నిర్మాణ పనుల వద్ద వ్యర్థ జలాలను రోడ్డుపైకి వదులుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణ పనుల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు రహదారిపైకి చేరుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.రోడ్డుపైకి వ్యర్థ జలాలు రావడం వల్ల బురద పేరుకుపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....