prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:28 pm Digital Edition : SRINIVAS RAMAGUNDAM

ప్రముఖ వైద్యుడు నాగిరెడ్డి ఇంటి నిర్మాణ పనులపై ఆరోపణలు

రోడ్డుపైకి వ్యర్థ జలాలు వదులుతూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ ఫిర్యాదులు

రామగుండం కార్పొరేషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్ స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి

గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రముఖ వైద్యుడు నాగిరెడ్డి ఇంటి నిర్మాణ పనుల వద్ద వ్యర్థ జలాలను రోడ్డుపైకి వదులుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణ పనుల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు రహదారిపైకి చేరుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.రోడ్డుపైకి వ్యర్థ జలాలు రావడం వల్ల బురద పేరుకుపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.ప్రముఖ వైద్యుడు నాగిరెడ్డి ఇంటి నిర్మాణ పనుల వద్ద రోడ్డుపైకి వ్యర్థ జలాలు వదులుతున్నారనే ఫిర్యాదులపై రామగుండం కార్పొరేషన్ కమిషనర్, పeddపల్లి జిల్లా కలెక్టర్ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.