prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 9:10 pm Digital Edition : PRAJA VANI

ప్రమాదవశాత్తు మృతి చెందిన సున్నం శివాజీకి ఘన నివాళి

ప్రమాదవశాత్తు మృతి చెందిన సున్నం శివాజీకి ఘన నివాళి,..

సర్పంచ్ వరస.మంగమ్మ

బూర్గంపాడు (ప్రజావాణి), సెప్టెంబర్ 20:

బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామపంచాయతీ పరిధిలో గల సున్నం శివాజీ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విషయం తెలుసుకున్న ఉప్పుసాక గ్రామపంచాయతీ సర్పంచ్ వరస. మంగమ్మ మృతదేహాన్ని సందర్శించి, శివాజీకి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శివాజీ మృతి పట్ల గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ శివాజీ మృతి ఎంతో బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమం లొ ఉప సర్పంచ్ పోదాం సుధాకర్, మాజీ సర్పంచ్ పాయం వెంకటేశ్వర్లు, సి పి ఐ మండల కార్యదర్శి సపకం నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ఉప్పు సాక గ్రామ శాఖ అధ్యక్షులు కందుల రాంబాబు, కాంగ్రెస్ పార్టీ సినియార్ నాయకులు వరస లక్ష్మయ్య, వార్డు సభ్యులు కొరస వెంకటేష్, అజ్మీరా బాబురావు,బొల్లి రామకృష్ణ, సోడే జయంతి,మడకం అరుణ, ధరావత్ జానకి మరియు గ్రామ యువత పాల్గొన్నారు