prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 6:46 am Digital Edition : MAHESH MEDCHAL

ప్రమాదంలో గాయపడిన వినోద్ మృతి

నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ శివునూరి వినోద్ మృతి

మేడ్చల్: ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన శివునూరి వినోద్ కుమార్ (26) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:05 గంటలకు మృతి చెందాడు.

కొద్ది రోజుల క్రితం మజీద్‌పూర్ ఎక్స్‌రోడ్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం 12:05 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మా కొడుకు బ్రతకడానికి ధన్యవాదాలు తెలిపారు.

వినోద్ మృతితో రాజబొల్లారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.