ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు షాక్: కాశినాయన మండలంలో వాగు పోరంబోకు ముళ్లకంచెలు తొలగించిన రెవెన్యూ అధికారులు!
గొంటువారిపల్లెలో రంగంలోకి దిగిన తహసీల్దార్.. మాజీ సర్పంచ్ అనుచరుల అక్రమ సాగుపై కొరడా! శ్రీ అవధూత కాశినాయన సెప్టెంబర్ 30ప్రజావాణి మండలం:ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు మరోసారి నిరూపించారు. శ్రీ అవధూత కాశినాయన మండల పరిధిలోని గొంటువారిపల్లె గ్రామ పంచాయితీలో బుధవారం భారీ ఎత్తున ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ బోవిళ్ళ పిచ్చిరెడ్డి ప్రధాన అనుచరుడు బోవిళ్ళ నరసింహారెడ్డి అక్రమంగా నిర్మించిన ముళ్లకంచెలను తహసీల్దార్...