ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ విమోచన దినోత్సవం
ప్రజావాణి కూసుమంచి, సెప్టెంబర్ 17:
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం వెంకట్రాంపురం (చిన్న పోచారం) ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు జెండాకు వందనం చేశారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.
దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం, తెలంగాణ విమోచన ఉద్యమం గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ గ్రామంలోని పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా సౌకర్యాలు, నాణ్యమైన బోధనపై తల్లిదండ్రులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.