ప్రభుత్వ దాడులకు నిరసన – మునుగోడులో భారీ ధర్నా – దద్దరిల్లిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గర్జన
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను అడ్డుకోవడాన్ని, శాసనసభలో మహిళా ఎమ్మెల్యేలపై చేసిన దాడులను నిరసిస్తూ మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా మునుగోడు ప్రగతి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరైనారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గొంతు ఎత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన...