prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 12:02 pm Digital Edition : RAJASHEKARREDDY

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాళోజి నారాయణ రావు జయంతి వేడుకలు

 

బెజ్జంకి, సెప్టెంబర్ 9 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NSS ఆధ్వర్యంలో ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఏ . దేవస్వామి మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు రచనలు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించాయని, తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షకు ఆయన రచనలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి గొప్పతనాన్ని తన రచనల ద్వారా ప్రజలకు చాటిచెప్పిన కాళోజీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.