ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తులు
ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తులు మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఉద్యోగ అవకాశాలు సుల్తానాబాద్, సెప్టెంబర్ 21: సుల్తానాబాద్‌లోని క్యాడర్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో పనిచేయడానికి అర్హత కలిగిన ప్రత్యేక ఉపాధ్యాయులు (స్పెషల్ టీచర్స్) కావాలని పాఠశాల కరస్పాండెంట్ సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ అవకాశాలపై ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలు, సంబంధిత అర్హత సర్టిఫికెట్లతో ఈ నెల 25వ తేదీలోపు సుల్తానాబాద్‌లోని క్యాడర్ మానసిక దివ్యాంగుల పాఠశాలను సంప్రదించాలని కోరారు. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అవసరమైన ధ్రువపత్రాలతో...