prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 4:55 pm Digital Edition : PRAJA VANI

ప్రజా సేవకు గౌరవ డాక్టరేట్.

ప్రజా సేవకు గౌరవ డాక్టరేట్.

జూపెడకు చెందిన మండాది నరేందర్ గౌడ్‌కు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హానరరీ డాక్టరేట్–2026.

పాలేరు, ప్రజావాణి న్యూస్, సెప్టెంబర్ 15:

సామాజిక సేవ, ఆరోగ్య సేవలు, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణలో విశేష కృషి చేస్తున్న తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామానికి చెందిన మండాది మల్లయ్య–పద్మ దంపతుల చిన్న కుమారుడు మండాది నరేందర్ గౌడ్‌కు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ హానరరీ డాక్టరేట్–2026ను ప్రదానం చేసింది.
చిన్నతనం నుంచే ప్రజాసేవపై ఆసక్తి పెంచుకున్న నరేందర్ గౌడ్, 15వ ఏట నుంచి మధిరలో తన బాబాయి బొల్లగాని వీరభద్రం దంపతుల ప్రోత్సాహంతో విద్యాభ్యాసం కొనసాగించారు. శీలం వెంకటరెడ్డి, ప్రభుత్వ ఆయుర్వేద ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రామాచార్యులు మార్గదర్శకత్వంలో అనేక ఆరోగ్య శిబిరాల్లో పాల్గొన్నారు. హెల్త్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొంతకాలం ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేసిన అనంతరం 2016లో స్వంతంగా మెడికల్ షాప్, ప్రాథమిక చికిత్సాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.కోవిడ్ సమయంలో స్వచ్ఛందంగా ఉచిత మందులు, ఆక్సిజన్, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ సుమారు 500 మంది బాధితులకు వైద్య సహాయం అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2020లో సేవా రత్న, 2021లో వైద్య రత్న అవార్డులను అందుకున్నారు.తాజాగా ఆయన సామాజిక, ఆరోగ్య సేవలను పరిశీలించిన మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్, డాక్టర్ సీపీ యాదవ్ ఆధ్వర్యంలో నరేందర్ గౌడ్‌ను గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసింది. ఫరీదాబాద్‌లోని ది క్యాసిల్ ఆర్ట్ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో కరుణేష్ వర్మ, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ గీతాంజలి శర్మ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. నరేందర్ గౌడ్‌కు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల గ్రామస్థులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.