prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 10:11 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు, పరస్పర దాడులు ఎందుకు?

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

బిజెపి నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులు మాదగోని వెంకన్న గౌడ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాల్సిన అసెంబ్లీలో అధికారపక్షం, ప్రతిపక్షం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, దుర్భాషలాడుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చిన నాయకులే రాజకీయాలను ఇలా దిగజార్చడం బాధాకరం అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కరువు పరిస్థితులు, రైతుల సమస్యలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక ముఖ్యమైన అంశాలపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరగాలి. అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ వ్యక్తిగత విమర్శలకు, దూషణలకు దూరంగా ఉండి సహనం, సంయమనం పాటిస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలి అని అన్నారు.