ప్రజా సమస్యలపై కౌన్సిలర్ యెరికల్ రెడ్డి పోరాటం: ఖాళీ బిందెలతో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా.. దిగివచ్చిన యాజమాన్యం!
వైఎస్ఆర్ జిల్లా యర్రగుంట్ల సెప్టెంబర్ 28ప్రజావాణి: ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటానని 17వ వార్డు కౌన్సిలర్ యెరికల్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఇండియా సిమెంట్స్, ప్రస్తుతం అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ, ఆయన ప్రజలతో కలిసి సోమవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫ్యాక్టరీ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా స్థానిక మహిళలు, ప్రజలతో కలిసి ఖాళీ బిందెలతో ఫ్యాక్టరీ ఎదుట శాంతియుతంగా...