prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 11:32 am Digital Edition : PRAJA VANI

ప్రజా వాణి దిన పత్రిక వార్తకు స్పందన

“ప్రజా వాణి దిన పత్రిక వార్తకు స్పందన”

కాలేజీ విద్యార్థులకు బస్సు పునరుద్ధరణ

ప్రజా వాణి కృషికి లద్నూరు గ్రామస్థుల హర్షం

ప్రజా వాణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు

మద్దూరు సెప్టెంబర్ 15, ప్రజా వాణి,

మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు విద్యా కోసం జనగామకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉన్న బస్సును తొలగించడంతో ఈ నెల 9న లద్నూరు గ్రామ పంచాయతీ ముందు 30 మంది విద్యార్థులు స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు చేపట్టిన ధర్నాతో స్పందించిన డిపో మేనేజర్ ఏం. ఉషా మంగళవారం నుండి యధావిధిగా బస్సు పునరుద్ధరణ చేయడంతో డిపో మేనేజర్ కు కృతజ్ఞతలు తెలిపారు.అదే విధంగా మా విద్యార్థుల సమస్యను అధికారుల దృష్టికి మా సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేసిన ప్రజా వాణి దిన పత్రిక యాజమాన్యానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.