prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 12:46 pm Digital Edition : PRAJA VANI

ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ కొరడా!

“ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ కొరడా”

“పెండింగ్ ఫైళ్లకు చెక్ పెట్టండి!”

 

“ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండొద్దు”

 

“ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు”

“ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి”

 

 

అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

 

మెదక్, జిల్లా బ్యూరో ప్రజావాణి

సెప్టెంబర్ 7:

 

ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిశీలించి, పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

సోమవారం మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 61 దరఖాస్తులు అందాయి. వీటిలో భూభారతికి సంబంధించి 22, ఇందిరమ్మ ఇళ్లకు 9, పెన్షన్లకు 5, ఇతర సమస్యలకు 25 దరఖాస్తులు ఉన్నాయి.

అనంతరం సీఎం ప్రజావాణి, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును అధికారులు బాధ్యతగా పరిశీలించాలని, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా అధికారులు స్పందించాలని అన్నారు. పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు విధుల్లో సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు