*ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి…*
*వివిధ ప్రాంతాల ప్రజల నుండి 83 అర్జీల స్వీకరణ.*
*సంబంధిత అధికారులను ఆదేశించిన ఇంచార్జ్ కలెక్టర్.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28*
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఇంచార్జీ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. సోమ వారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్య క్రమంలో జిల్లా ఇంచార్జీ కలెక్టర్ , రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి లతో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 83 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి లో వచ్చినదరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటి కప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 53 , సర్వే ల్యాండ్స్ 9 , డి ఆర్ డిఎ 5 , మున్సి పాలిటీ 5 సివిల్ సప్లై 2 , వ్యవసాయ , ఇరిగేషన్ , ఉపాధి కల్పన , వైద్య ఆరోగ్య , ఎక్సైజ్ , మత్య , యం పి డి ఓ , హోసింగ్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.
ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటికపుడు డిస్పోస్ చేయాలని ఆదేశించారు. ఈ కార్య క్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ , డిప్యూటీ కలెక్టర్ కృతిక , జెడ్పీ సీఈఓ శోభా రాణి , జిల్లా గ్రామీణా అభివృద్ధి అధికారి నాగిరెడ్డి , హౌసింగ్ పీడీ అలివేలు , వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.