*విధుల్లో అలసత్వం వహించిన అంగన్వాడి టీచర్ పత్తి కవితకి మెమో జారీ*
*దంతాలపల్లి సెక్టర్ సూపర్వైజర్ మంగాదేవి*
దంతాలపల్లి
సెప్టెంబర్ 29 (ప్రజావాణి)
అంగన్వాడి సెంటర్లో విధి నిర్వహణలో అలసత్వం వహించిన దంతాలపల్లి మండలం కుమ్మరి కుంట్ల గ్రామం ఎస్సీ కాలనికి చెందిన రెండో అంగన్వాడి సెంటర్ అంగన్వాడి టీచర్ పత్తి కవిత , ఆయాకు మెమో జారీ చేసినట్టుగా దంతాలపల్లి సెక్టార్ సూపర్వైజర్ మంగాదేవి తెలియజేశారు.సోమవారం విధులకు సక్రమంగా హాజరు కాకుండా మధ్యాహ్నం 11:30 అయినా కూడా అంగన్వాడి సెంటర్ కు తాళం వేసి వారి ఇష్టాను రీతిగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడి సెంటర్ పై విధి నిర్వహణలో అలసత్వం అంటూ ప్రజా వాణి పత్రికలో కథనం ప్రచురించగా ఐసిడిఎస్ సిడిపిఓ ,ఎల్లమ్మ స్పందించి స్థానిక సూపర్వైజర్ చేత విచారణ జరిపి అంగన్వాడి టీచర్, ఆయాకు, మెమో జారీ చేసినట్టు తెలిపారు.