ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దు
*ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దు* .జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావివ్వకుండా సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్, ఎం. సంపత్‌రావు, జిల్లా రెవెన్యూ అధికారి...