ప్రజావాణి అర్జీలను వారంలోగా పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలను వారంలోగా పరిష్కరించాలి జాప్యం, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి, సెప్టెంబర్ 28 (మన ప్రజావాణి): ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 81 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేలా...