ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన
ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 29
కూసుమంచి: మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో విబిజి రామ్‌జీ పథకం కింద వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక (VGPP) రూపకల్పనలో భాగంగా మంగళవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈశ్వరమాధారం, నేలపట్ల, పెరికసింగారం, గైగొల్లపల్లి, సంధ్య తండా, నాయకులగూడెం, మంగలీ తండా, మునిగేపల్లి, కోక్య తండా, లోక్య తండా గ్రామపంచాయతీల్లో గౌరవ సర్పంచుల అధ్యక్షతన సమావేశాలు జరిగాయి.
ఈ సందర్భంగా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో సామాజిక పటం, సహజ వనరుల పటం రూపొందించారు. గ్రామాల్లో ఉన్న వనరులు, అవసరాలు, మౌలిక సదుపాయాలను గుర్తించి భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రజల సూచనల మేరకు గుర్తించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు తెలిపారు.
కార్యక్రమాల్లో ఎంపీడీవో, ఏపీవో, ఇంజనీరింగ్ కన్సల్టెంట్, గ్రామ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.