ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి ప్రణాళిక
VGPPలో సోషల్, సహజ వనరుల మ్యాపింగ్.. అవసరమైన పనుల గుర్తింపు
ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 28:
కూసుమంచి మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (VB-G RAM G–VGPP) కార్యక్రమం సోమవారం ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించారు. పోచారం, కిష్టాపురం, చౌటుపల్లి, బోడే తండా, గొరిల్లాపాడు తండా, అజ్మీర హనుమంతండా, మల్లాయిగూడెం, అగ్రహారం, కేశ్వాపురం, గట్టుసింగారం గ్రామపంచాయతీల్లో కార్యక్రమాలు చేపట్టారు.
గ్రామాల్లోని ప్రజల అవసరాలు, మౌలిక వసతులు, సహజ వనరులు, సమస్యలను గుర్తించేందుకు సోషల్ మ్యాప్, సహజ వనరుల మ్యాప్‌లను రూపొందించారు. గ్రామస్తుల సూచనలు, అభిప్రాయాలను సేకరించి వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, నీటిపారుదలతో పాటు ఇతర రంగాలకు సంబంధించిన అభివృద్ధి పనులను గుర్తించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో పనులను ఎంపిక చేసి గ్రామాభివృద్ధి ప్రణాళికలో పొందుపరచనున్నారు.
పోచారంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ సల్వాది గురుమూర్తి, వార్డు సభ్యులు ఖంభం మహేష్, పంచాయతీ కార్యదర్శి జి. రాంబాబు, టీఏ హరినాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్. యాదగిరి, VB-G RAM G సిబ్బంది, గ్రామ దీపికలు, ఎంపీడబ్ల్యూ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.