prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:17 pm Digital Edition : PRAJA VANI

ప్రజలు మెచ్చిన దేవుడు:రమేష్ రాయల్

ప్రజలు మెచ్చిన దేవుడు:రమేష్ రాయల్

అనంతపురం ప్రజావాణిప్రతినిది సెప్టెంబర్ 23:ఏ సమయంలోనైనా సాయం చేయడానికి నేనున్నానని భరోసానిస్తూ ఆర్థికంగా చేయూతనిస్తూ ప్రతి ఒక్క హృదయాలలో చిరస్థాయిగా నిలిచే నిజమైన దేవుడులా కొనియాడబడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ యువ నాయకులు మున్నా నగర్ ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడు రమేష్ రాయల్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రమేష్ రాయలు ఆధ్వర్యంలో పలువురికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మున్న నగర్ ప్రాంత ప్రజలు మాట్లాడుతూ రమేష్ రాయల్ కుటుంబం ఎప్పుడు సాయం చేసే కుటుంబమని ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా అర్దరాత్రి అయినా సరే నేనున్నానంటూ భరోసనిస్తూ వారికి చేయూతనిస్తున్నారని ఇలాంటి మంచి మనసున్న యువ నాయకులు మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అదేవిధంగా వివిధ దేవాలయాల మరమతులకు కూడా రమేష్ రాయల్ సొంత నిధులతో దాదాపు లక్షలాది రూపాయలు వెచ్చించి ఆయన సేవాభావాన్ని రుజువు చేసుకున్న ఘనత రమేష్ రాయల్ కే దక్కుతుందన్నారు. అలాగే మహిళలకు కూడా కుట్టుమిషన్లు అనేక సందర్భాల్లో పంపిణీ చేసిన ఉన్నాయని గుర్తు చేసుకున్నారు కుటుంబాల అవసరాలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ప్రతి హృదయంలో చిరస్థాయిగా నిలిచే ప్రజా నాయకుడిగా ఉంటారని ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయల్ రమేష్ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో నిలవాలంటే వారి కష్టసుఖాలను క్షుణ్ణంగా తెలుసుకొని కుల మతాలకు అతీతంగా వారికి అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తూ వారి బాగోగులను చూడడమే నిజమైన నాయకుని లక్షణాలుగా తమ భావిస్తున్నామని ఇందులో భాగంగానే తమ కుటుంబం చేయవలసినంత సహాయాన్ని కూడా అందిస్తున్నామని ఇకముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాలలో ఒక మంచి నాయకునిగా నిలవాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని ఆ రకంగా ముందుకు వెళ్తామని రాయల్ రమేష్ స్పష్టం చేశారు.