prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 5:21 pm Digital Edition : MAHESH MEDCHAL

ప్రజలకు మెరుగైన వసతులే లక్ష్యం: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావుడ్యా శ్రీదేవి

అభివృద్ధి పథంలో నూతనకల్‌
ప్రజలకు మెరుగైన వసతులే లక్ష్యం: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావుడ్యా శ్రీదేవి
ఎల్లంపేట్‌, సెప్టెంబర్‌ 16: ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్‌ వార్డులను అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావుడ్యా శ్రీదేవి రమేష్‌ నాయక్‌ తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, స్థానిక కౌన్సిలర్ల సహకారంతో నూతనకల్‌లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్‌ 16వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో అంతర్గత మురికి కాలువ నిర్మాణం, 21వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. చైర్‌పర్సన్‌, కమిషనర్‌, స్థానిక కౌన్సిలర్లు కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లు సద్ది సురేష్‌రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్‌ మాట్లాడుతూ నూతనకల్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. చైర్‌పర్సన్‌ లావుడ్యా శ్రీదేవి, కమిషనర్‌ కృష్ణారెడ్డి సహకారంతో నూతనకల్‌ వార్డుల్లో అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని చెప్పారు. రహదారులు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
నూతనకల్‌ వార్డు కార్యాలయంలో పోస్ట్‌ ఆఫీస్‌ ప్రారంభం
అభివృద్ధి పనుల ప్రారంభం అనంతరం నూతనకల్‌ వార్డు కార్యాలయంలో పోస్ట్‌ ఆఫీస్‌ను ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలకు పోస్టల్‌ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ రజిత దేవేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు సద్ది నిషిత, బంధిల్ల కుమార్‌, రజిత రాజేందర్‌, నీరుగంటి శ్రీలత రమేష్‌ యాదవ్‌, అఖిల సాయికుమార్‌, దుడ్డు కల్పనా మాణిక్యం, వరలక్ష్మి సురేందర్‌, ఓం ప్రకాశ్‌, నరసింహ, శారద రాజు నాయక్‌, అర్చన శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
అలాగే స్థానిక నాయకులు, మాజీ మండల కో-ఆప్షన్‌ సభ్యురాలు రుక్సానా యూనిస్‌ పాషా, మాజీ గ్రామ సర్పంచ్‌ కవిత జీవన్‌, వీర్లపల్లి దామోదర్‌రెడ్డి, పద్మారావు, నారాయణరెడ్డి, గుంటి కుమార్‌, దీపక్‌, కుమారస్వామి, విష్ణు, సంజీవ భూషణం, యాదగిరి, నాగిరెడ్డి, వీరస్వామి, సుదర్శన్‌, ప్రసాద్‌ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నూతనకల్‌ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.