ప్రజలకు చేరువగా దామెర ఎస్సై వీరభద్రరావు

ప్రజలకు చేరువగా దామెర ఎస్సై వీరభద్రరావు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు.. వినాయక మండపాలపై అప్రమత్తత ప్రజావాణి హనుమకొండ నవీన్ బ్యూరో దామెర సెప్టెంబర్ 14: కొద్దిరోజుల క్రితమే దామెర పోలీస్‌స్టేషన్‌ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వీరభద్రరావు ప్రజలకు చేరువగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మండలంలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు...