ఎండపల్లి మండల అభివృద్ధి పనులపై ప్రత్యేక అధికారి ఎం రవి ప్రసాద్ (DFO) అధ్యక్షతన గుల్లకోట రైతు వేదికలో సమీక్షా సమావేశం జరిగింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ఈ భేటీ సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితోనే మండల అభివృద్ధి సాధ్యమని రవి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.