పౌర్ణమికి రాజనాల బండలో రామకోటి<br>

పౌర్ణమికి రాజనాల బండలో రామకోటిచౌడేపల్లి: పౌర్ణమి సందర్భంగా అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని రాజనాల బండ ఆంజనేయస్వామి ఆలయంలో రామకోటి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.శనివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే రామకోటి కార్యక్రమం ఆదివారం ఉదయం 5 గంటల వరకు 24 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగనుంది. కొలతూరు ఓబుల్‌రెడ్డి భక్త ఆంజనేయస్వామి బృందం ఆధ్వర్యంలో రామనామ స్మరణ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమానికి మైక్‌సెట్‌ రమణ ఆధ్వర్యంలో ధ్వని ఏర్పాట్లు చేస్తున్నారు....