పోషణ మాసోత్సవాలతో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం
ఐ సి డి సి చేర్యాల ప్రాజెక్ట్ సి డి పి ఓ రమాదేవి
అంగన్వాడి కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలి ఎంపిడిఓ శ్రీనివాస్
మద్దూరు సెప్టెంబర్ 23, ప్రజా వాణి,
మద్దూరు మండలంలోని
లద్నూరు గ్రామ రైతు వేదికలో నిర్వహించిన పోషణ మాసోత్సవ కార్యక్రమంలో సీడీపీవో రమాదేవి,ఎంపిడిఓ శ్రీనివాస్ లు ముఖ్య అతిథిలుగా పాల్గొని పోషణ ప్రాధాన్యతపై మాట్లాడారు.గర్భిణులు, బాలింతలు,చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆమె తెలిపారు.చిన్నారుల ఎదుగుదలకు అవసరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు.గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పోషకాహార లోపం వల్ల కలిగే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రతి కుటుంబంలో పెంపొందించాలని రమాదేవి సూచించారు. పోషణ మాసోత్సవాల ఉద్దేశం ప్రతి కుటుంబానికి పోషణపై అవగాహన కల్పించడమేనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్, ఎంపీఓ, ఏ పి ఓ మంజుల,గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు, అంగన్వాడి సూపర్వైజర్ దేబోరరాణి,ఉప సర్పంచ్ శివ కుమార్, వార్డు సభ్యులు పాకాల శోభ, కొమ్ము భాస్కర్,పూల శరత్, మంజుల గోవింద్,సరస్వతి సుధాకర్, బిస్మా చారి,ఏ ఎన్ ఏం యాదమ్మ, ఆశా కార్యకర్తలు ప్రవళిక,పద్మ,అంగన్‌వాడీ కార్యకర్తలు,ఆయాలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.