పోషణ మాసోత్సవం
సెప్టెంబర్ 22.ప్రజావాణి న్యూస్ /సంగెం
పోషణ మాసం సందర్భంగా సంగెం మండలం తీగరాజుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఉపసర్పంచ్ ప్రవీణ్ హాజరై మహిళలకు పోషకాహార ప్రాముఖ్యతపై వివరించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సమతుల్య, పోషకాలున్న ఆహారం తీసుకోవాలని, రక్తహీనత నివారణకు ఆకుకూరలు, పండ్లు, గుడ్లు తీసుకోవాలని సూచించారు.
అనంతరం అంగన్‌వాడీ ఆధ్వర్యంలో పౌష్టికాహార ప్రదర్శన,అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు లత,మాధవి హై స్కూల్ ఉపాధ్యాయులు విజయ్ కుమార్ నిర్మల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు,అంగన్‌వాడీ టీచర్లు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.