పోషకాహారంతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యం
*పోషకాహారంతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యం* *సిద్ధన్నపేటలో ఘనంగా పోషణ మాసోత్సవం* నంగునూరు, సెప్టెంబర్ 28 : పోషకాహారంతో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని నంగునూరు తహశీల్దార్ ప్రవీణ్ రెడ్డి అన్నారు. పోషణ అభియాన్‌లో భాగంగా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో సోమవారం పోషణ మాసోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు కత్తుల గంగా భవాని, కాచగోని లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహశీల్దార్ ప్రవీణ్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఆర్ఐ లింగం, ఏపీఎం శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి అనితా రెడ్డి,...