పోలీస్ స్టేషన్‌నే టార్గెట్ చేసిన దొంగలు.. పెట్రోలింగ్ ఇన్నోవా చోరీ

పోలీస్ స్టేషన్‌నే టార్గెట్ చేసిన దొంగలు.. పెట్రోలింగ్ ఇన్నోవా చోరీ   కరీంనగర్, సెప్టెంబర్ 8(ప్రజావాణి) కరీంనగర్ జిల్లాలో వరుస చోరీలతో దుండగులు హల్‌చల్‌ చేస్తున్న వేళ.. తాజాగా పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనాన్నే ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల వాహనమే చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ ఇన్నోవా కారును అర్ధరాత్రి సమయంలోగుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసినట్లు సమాచారం. వాహనాన్ని ఎత్తుకెళ్లిన అనంతరం రాత్రంతా నగరంలో తిరిగినట్లు తెలుస్తోంది....