prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:02 pm Digital Edition : PRAJA VANI

పోలీస్ గ్రీవెన్స్ లో బాధిత ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి

పోలీస్ గ్రీవెన్స్ లో బాధిత ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పి .. బాధితులకు చట్ట పరంగా తగిన న్యాయం చేయాలని అధికారులకు ఆదేశం ..

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ జిల్లాలో వివిద పోలీస్ స్టేషన్ పరిదిలో నుంచి వచ్చిన దాదాపు 30 మంది బాధితులసమస్యలను, ఫిర్యాదులను విని సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, మోసాలు, ఆస్తి సంబంధిత వివాదాలు తదితర అంశాలపై తమ ఫిర్యాదులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో మాట్లాడి బాధితుల ఫిర్యాదుల విషయంలో ఎలాంటి జాప్యం చేయకుండా, వాస్తవాలను పూర్తిస్థాయిలో విచారించి అవసరమైన చోట కేసులు నమోదు చేయడం, దర్యాప్తు చేపట్టడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారంపై స్పష్టమైన సమాచారం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకువచ్చినప్పుడు వాటిని బాధ్యతాయుతంగా స్వీకరించి, బాధితులకు అండగా నిలవాలని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు.