పోరుమామిళ్ల హోలీ రోసరి పాఠశాలలో ముందస్తుగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 3 (ప్రజావాణి) మండల కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ 'హోలీ రోసరి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్'లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ముందస్తుగా అత్యంత వైభవంగా,కన్నులపండువగా నిర్వహించారు.నిజానికి మరుసటి రోజు పండుగ కావడంతో ఆ రోజు పాఠశాలకు ప్రభుత్వ హాలిడే (సెలవు) ఉన్నందున,విద్యార్థులందరూ కలిసి పండుగను ఆనందించేలా ఒక రోజు ముందే ఈ సంబరాలను ఏర్పాటు చేశారు.ఈ వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని,జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. చిన్నారుల రాధాకృష్ణుల వేషధారణలు:...