prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 7:01 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్ల హోలీ రోసరి పాఠశాలలో ముందస్తుగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 3 (ప్రజావాణి) మండల కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ ‘హోలీ రోసరి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్’లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ముందస్తుగా అత్యంత వైభవంగా,కన్నులపండువగా నిర్వహించారు.నిజానికి మరుసటి రోజు పండుగ కావడంతో ఆ రోజు పాఠశాలకు ప్రభుత్వ హాలిడే (సెలవు) ఉన్నందున,విద్యార్థులందరూ కలిసి పండుగను ఆనందించేలా ఒక రోజు ముందే ఈ సంబరాలను ఏర్పాటు చేశారు.ఈ వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని,జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
చిన్నారుల రాధాకృష్ణుల వేషధారణలు:
ఈ సందర్భంగా పాఠశాల చిన్నారి విద్యార్థిని,విద్యార్థులు శ్రీకృష్ణుడు,రాధ,గోపికల వేషధారణలతో అలరించారు.సాంప్రదాయ దుస్తులు ధరించి,తలపై నెమలి పించాలు,చేతిలో పిల్లనగ్రోవులతో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారుల రూపాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సంస్కృతిని చాటిచెప్పేలా వేడుకలు:
కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ సునీల్ మాట్లాడుతూ.చదువుతో పాటు విద్యార్థులలో భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలపై గౌరవాన్ని,భక్తిభావాన్ని పెంపొందించడానికే ఇలాంటి పండుగలను పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పండుగ రోజు సెలవు ఉన్నప్పటికీ,విద్యార్థులలో పండుగ వాతావరణం మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు వేడుకలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.చిన్నారులందరికీ ఆయన ముందస్తు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు,కృష్ణుడి భక్తి గీతాలకు చేసిన నృత్యాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల మరియు సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.