పోరుమామిళ్ల సబ్ పోస్టాఫీస్ వద్ద అస్తవ్యస్తంగా లెటర్ బాక్స్: ఉత్తరాలకు భద్రత ఏది?పోస్ట్ ఆఫీస్ లెటర్ బాక్స్‌కు కనీసం తాళం కూడా లేదు!

పోరుమామిళ్లలో పోస్టల్ శాఖ నిర్లక్ష్యం..రోడ్డుపై పడి ఉన్న ఉత్తరాల పెట్టె, ప్రజల ఆగ్రహం పోరుమామిళ్ల:సెప్టెంబర్ 15 ప్రజావాణి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అత్యంత నమ్మకమైన, పురాతన సేవలలో ఒకటైన ఇండియన్ పోస్టల్ శాఖ నిర్లక్ష్యం పోరుమామిళ్లలో బట్టబయలైంది.కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని సబ్ పోస్టాఫీస్ (పిన్ కోడ్: 516193) ఆవరణలో ఉండాల్సిన లెటర్ బాక్స్ (ఉత్తరాల పెట్టె) ప్రస్తుతం అత్యంత దయనీయ, అస్తవ్యస్త స్థితిలో రోడ్డుపై పడి ఉండటం స్థానిక ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. డిజిటల్ యుగంలో కూడా కోర్టు నోటీసులు,ప్రభుత్వ ఉత్తరాలు,ఉద్యోగ...