పోరుమామిళ్ల మల్లకతువ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన: మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కీలక ఆదేశాలు
భక్తులకు ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రత.సీఐ,ఎస్ఐలతో కలిసి చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించిన డీఎస్పీ. పోరుమామిళ్ల,సెప్టెంబర్ 15 ప్రజావాణి పట్టణ పరిధిలోని ప్రముఖ మల్లకతువ చెరువు వద్ద గణేష్ నిమజ్జన వేడుకల ఏర్పాట్లను మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మంగళవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉండటంతో,ముందస్తు జాగ్రత్త చర్యలపై ఆయన పోలీసు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్,...