పోరుమామిళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం: ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడమే లక్ష్యం
పోరుమామిళ్ల, సెప్టెంబర్ 20:ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ పిలుపులో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నాడు శానిటేషన్ క్లీన్‌నెస్ (పరిశుభ్రత-ఆరోగ్యం) కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కళాశాల స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ బోయిళ్ళ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్ అధ్యక్షత వహించారు. ఆరోగ్యం, సామాజిక బాధ్యతపై అవగాహన: కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రిన్సిపాల్ డాక్టర్ శామ్యూల్ డేవిడ్ రాజ్...