పోరుమామిళ్ల నూతన ఎస్సైగా విద్యాసాగర్ బాధ్యతల స్వీకరణ
కడప జిల్లా: పోరుమామిళ్ల సెప్టెంబర్ 24 ప్రజావాణి పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా ఎ.విద్యాసాగర్ బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ యంత్రాంగంలో జరిగిన అంతర్గత బదిలీల్లో భాగంగా ఆయనను ఇక్కడికి నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వుల మేరకు ఆయన పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా బాధ్యతలను స్వీకరించి,విధుల్లో చేరారు.నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన విద్యాసాగర్‌కు కడప జిల్లా పరిధిలో సుదీర్ఘమైన పని అనుభవం ఉంది. ఆయన గతంలో జిల్లాలోని పలు కీలకమైన ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించారు....