పోరుమామిళ్ల కళాశాల మైదానంలో చీకట్లు: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనంపై స్థానికుల ఆగ్రహం

పోరుమామిళ్ల,సెప్టెంబర్ 15:ప్రజావాణి కడప జిల్లాలోనే అతిపెద్ద మైదానాలలో ఒకటిగా పేరుగాంచిన స్థానిక పోరుమామిళ్ల ప్రభుత్వ కళాశాల మైదానం ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది.ఒకప్పుడు క్రీడాకారులు,స్థానికులతో కళకళలాడిన ఈ మైదానం.నేడు చీకటి పడితే చాలు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం -అంధకారంలో మైదానం సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి ఈ మైదానం పూర్తి అంధకారంలోకి వెళ్ళిపోయిందని ప్రజలు చెబుతున్నారు.గతంలో సర్పంచులు అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి విద్యుత్...