పోరుమామిళ్లలో ‘సిండికేట్’ దందా: క్వార్టర్ బాటిల్‌పై రూ. 10 నుండి 20 అదనం.చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ*

వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 9 ప్రజావాణి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని కలస్పాడు కాశినాయన పోరుమామిళ్ల లో  వైన్ షాపులు నిబంధనలను నిలువునా పాతర వేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట విక్రయ ధరలకే (మ్యాగ్జిమమ్ రిటైల్ ప్రైస్ - మద్యం విక్రయించాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మద్యం బాటిల్‌పై, ముఖ్యంగా క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ. 10 నుండి రూ. 20 వరకు వసూలు చేస్తూ సామాన్య ప్రజలను, గిరాకీదారులను నిలువునా దోచుకుంటున్నారు....