పోరుమామిళ్లలో వైభవంగా వినాయక నిమజ్జనోత్సవం: శాంతియుత వాతావరణంలో ముగిసిన మూడో రోజు వేడుకలు

కడప జిల్లా పోరుమామిళ్ల,సెప్టెంబర్16ప్రజావాణి మండల పరిధిలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం మండలంలోని వివిధ గ్రామ వీధుల్లో ప్రతిష్టించిన పలు వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు.స్థానిక మల్లకత్వ చెరువులో ఈ నిమజ్జన వేడుకలు జరిగాయి.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది.భారీ క్రేన్ల సహాయంతో వినాయక విగ్రహాలను చెరువులో సురక్షితంగా నిమజ్జనం చేశారు. రంగంలోకి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం ఈ వేడుకలను అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో...